వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలోని వరహాల గడ్డలో గుర్రపు డెక్కలు పెరగడంతో వర్షపు నీరు నిలిచిపోతోంది. దీంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిల్వ నీటిలో దోమలు విపరీతంగా పెరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల బెడదతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
దుర్వాసనతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. అధికారులు స్పందించి గుర్రపు డెక్కలను తొలగించాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు.
Comments
Loading comments...

