Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 6:32 PM జగిత్యాలGeneral
వృద్ధుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - Udayam
వృద్ధుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురిలో తెలంగాణ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ముద్రించిన వృద్ధుల రక్షణ చట్టం పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. నిరాదరణకు గురవుతున్న వృద్ధుల సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.

Comments

G
Loading comments...