Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంశధార నదికి మొదటి ప్రమాద హెచ్చరిక

Follow Udayam on Google
Hari Sep 25, 2026 10:05 AM శ్రీకాకుళంGeneral
వంశధార నదికి మొదటి ప్రమాద హెచ్చరిక - Udayam
తుఫాను ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వంశధార నదిలో వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో వంశధార ఇంజినీరింగ్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక బెల్ మోగించారు. గురువారం రాత్రి 11 గంటల సమయానికి వంశధార నదిలో వరదనీటి ప్రవాహం 40,079 క్యూసెక్కులకు చేరుకుంది. గొట్టా బ్యారేజ్ వద్ద 15 గేట్లను 80 సెంటీ మీటర్లు, 4 గేట్లను 60 సెంటీమీటర్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీరు విడిచిపెట్టారు.

Comments

G
Loading comments...