Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర ఎస్సీ కాలనీలో హెచ్చరిక ఫ్లెక్సీలు

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 6:37 PM విజయనగరంGeneral
వంగర ఎస్సీ కాలనీలో హెచ్చరిక ఫ్లెక్సీలు - Udayam
వంగర ఎస్సీ కాలనీ చివర ఉన్న గుమ్ములలో చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని గ్రామపంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ చిన్నరావు వెల్లడించారు. మంగళవారం ఆ ప్రాంతంలో హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ బాటిళ్లు, వ్యర్థాలను చెత్త సేకరణ బండ్లలోనే వేయాలని, బహిరంగ మలవిసర్జన చేయరాదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...