వార్తలకు తిరిగి వెళ్లండి

నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 20 వరకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఇచ్చింది.
ఎన్‌ఆర్‌ఐ, డిఫెన్స్ దర్శనాలను కూడా నిలిపివేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
Comments
Loading comments...

