Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలసగూడ-లోతుగూడ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానం

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 5:05 PM పార్వతీపురం మన్యంGeneral
వలసగూడ-లోతుగూడ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానం - Udayam
సీతంపేట (M)లోని వలసగూడ, లోతుగూడ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. కురుస్తున్న వర్షాలతో రహదారి మొత్తం బురదమయంగా మారడంతోపాటు పలుచోట్ల గుంతల్లో నీరు నిలిచిపోతోంది. దీంతో గ్రామస్థులు, ద్విచక్ర వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...