వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా మరికల్ మండలం మాద్వార్లో భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో భార్య రాములమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహేతర సంబంధంపై గొడవలే కారణమని డీఎస్పీ లింగయ్య తెలిపారు.
గత నెల 24న నిద్రిస్తున్న బాలస్వామి (46)పై పెట్రోల్ పోసి నిప్పంటించగా, చికిత్స పొందుతూ 25న మృతిచెందాడు. విచారణలో రాములమ్మ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

