Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విఠలాపూర్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:47 AM సిద్దిపేటGeneral
విఠలాపూర్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం - Udayam
చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట పంట పొలాలకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా కూడా సక్రమంగా లేకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు నష్టపోతారని అన్నారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్‌ అందించాలని కోరారు.

Comments

G
Loading comments...