Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో కూటమి 42 డివిజన్ల కైవసం.. 1.19 లక్షల ఓట్ల ఆధిక్యం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 4:26 PM విశాఖపట్నంGeneral
విశాఖలో కూటమి 42 డివిజన్ల కైవసం.. 1.19 లక్షల ఓట్ల ఆధిక్యం - Udayam
విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 4,36,676 ఓట్లు లెక్కించారు. తెదేపాకు 2,56,881, వైకాపాకు 1,37,194, ఇతరులకు 37,163, కాంగ్రెస్‌కు 5,434 ఓట్లు వచ్చాయి. దీంతో తెదేపా 1,19,683 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 120 డివిజన్లలో కూటమి 42 చోట్ల గెలుపొందగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. తెదేపా 27, జనసేన 10, భాజపా 5, వైకాపా 4, ఇతరులు 2 డివిజన్లలో విజయం సాధించారు.

Comments

G
Loading comments...