వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌ఎస్‌ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనీ నెహ్రూ నగర్‌లో నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం నిధుల్లో మిగిలిన రూ.60 వేలతో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. వీరాంజనేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాంకులో 650 ప్లేట్లు, 100 గ్లాసులు అందుబాటులో ఉంచారు.
నెహ్రూ నగర్ బస్తీవాసులు ఇంట్లో జరిగే వివిధ కార్యక్రమాలకు వీటిని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

