Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:26 PM పెద్దపల్లి General
ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు - Udayam
సింగరేణి ఓసీపీ-2 విస్తరణలో భాగంగా రాజాపూర్‌లో సేకరించనున్న ఇళ్లు, చెట్ల విలువ అంచనా వేసేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను బుధవారం గ్రామస్థులు అడ్డుకున్నారు. పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై స్పష్టత లేకుండా అంచనా ఎలా వేస్తారని ప్రశ్నించారు. సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉపసర్పంచ్ శ్రీకాంత్ సెక్షన్ ఆఫీసర్ నహీదను ప్రశ్నించారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది వెనుదిరిగి వెళ్లారు.

Comments

G
Loading comments...