వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామసభలు, పంచాయతీలకు పూర్తి అధికారాలు కల్పించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. సమస్యలు ఎమ్మెల్యేల స్థాయికి వెళ్లకుండా, స్థానికంగానే పరిష్కారం కావాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవస్థల వికేంద్రీకరణ ద్వారానే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని, ఎమ్మెల్యేల చుట్టూ అధికారాన్ని కేంద్రీకరించడం వల్ల స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర బలహీనపడుతుందని పవన్ హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో ప్రజల తీర్పు చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

