Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌–గుంటూరు మధ్య ప్రత్యేక రైళ్లు

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 11:03 AM అమరావతిGeneral
వికారాబాద్‌–గుంటూరు మధ్య ప్రత్యేక రైళ్లు - Udayam
దసరా రద్దీ దృష్ట్యా వికారాబాద్‌–గుంటూరు మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వికారాబాద్‌ నుంచి అక్టోబర్‌ 9, 11 తేదీల్లో రాత్రి 10 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు గుంటూరు చేరుతుంది. గుంటూరు నుంచి అక్టోబర్‌ 8, 10 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు రైలు బయలుదేరుతుంది. ఈ రైళ్లు హైటెక్‌ సిటీ, సికింద్రాబాద్‌, నల్గొండ, నడికుడి, సత్తెనపల్లి తదితర స్టేషన్లలో ఆగుతాయి.

Comments

G
Loading comments...