Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో భారీగా పేలుడు పదార్థాలు కలకలం..

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 9:30 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో భారీగా పేలుడు పదార్థాలు కలకలం..  - Udayam
విజయవాడలో పొరపాటున బ్యాగ్ మారిపోవడంతో భారీగా పేలుడు పదార్థాలు వెలుగుచూడడం స్థానికంగా కలకలం రేపింది. నరసరావుపేట నుంచి వస్తున్న బస్సులో అనుమానాస్పదంగా ఉన్న 46 జిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను కృష్ణలంక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్ ఓపెన్ చేసి చూసిన ప్రయాణికుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వాటిని ఎందుకు తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...