వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రైల్వే స్టేషన్‌లో గురువారం సుమారు రూ.19 లక్షల విలువైన 38 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రైల్వే ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ పర్యవేక్షణలో జీఆర్పీ, ఆర్‌పీఎఫ్, ఈగల్ టీమ్, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సంయుక్తంగా సోదాలు నిర్వహించారు.
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని రెండు కేసులు నమోదు చేశారు. వారి నుంచి నాలుగు బండిళ్ల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

