Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14వ రోజుకు వీఆర్ఏల సమ్మె

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 3:26 PM కాకినాడGeneral
14వ రోజుకు వీఆర్ఏల సమ్మె  - Udayam
తమ డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరుకుంది. పేస్కేల్‌ వర్తింపజేయడంతో పాటు నామినీ పోస్టులను రెగ్యులర్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తుని గ్రామ సహాయకుల సంఘం అధ్యక్షులు లచ్చన్న, నాగేశ్వరరావు ఎమ్మెల్యే యనమల దివ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

Comments

G
Loading comments...