Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్‌ ధాన్యం అక్రమాలపై విజిలెన్స్‌ దాడులు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 31, 2026 11:34 AM హన్మకొండ General
సీఎంఆర్‌ ధాన్యం అక్రమాలపై విజిలెన్స్‌ దాడులు - Udayam
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో రెండు రైస్‌మిల్లుల్లో సీఎంఆర్‌ ధాన్యం అక్రమాలపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ధాన్యంలో 3,128 మెట్రిక్‌ టన్నులకుపైగా తేడాలను గుర్తించారు. లక్ష్మీనర్సింహ, వినాయక రైస్‌మిల్లుల్లో సుమారు రూ.9.50 కోట్ల విలువైన ధాన్యం స్వాహా జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...