Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వైర్ల కింద మండపాలు ఏర్పాటు చేయవద్దు

Follow Udayam on Google
p.g.murthy Sep 13, 2026 11:14 AM మంచిర్యాలGeneral
విద్యుత్ వైర్ల కింద మండపాలు ఏర్పాటు చేయవద్దు - Udayam
విద్యుత్ వైర్ల కింద వినాయక మండపాలను ఏర్పాటు చేయవద్దని లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. విద్యుత్ వైర్ల కింద మండపాలను ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మండపాలను సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, కరెంట్ వైరింగ్ సరిగ్గా ఉండేలా చూసుకొని విద్యుత్ సిబ్బంది సలహాలు పాటించాలని కోరారు

Comments

G
Loading comments...