Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్తో యువకుడి మృతి

Follow Udayam on Google
B Ganga Sep 20, 2026 9:50 AM పార్వతీపురం మన్యంGeneral
విద్యుత్ షాక్తో యువకుడి మృతి - Udayam
వీరఘట్టం మండలం చిదిమి గ్రామంలో శనివారం రాత్రి 8గంటలకు విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన పుర్రు సాయి (24) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. వేలాడుతున్న విద్యుత్ తీగ అనుకోకుండా తగిలి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. విద్యుత్ షాక్కు గురైన వెంటనే స్థానికులు స్పందించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...