Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పంటలు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:13 AM మెదక్General
విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పంటలు - Udayam
వెల్దుర్తి మండలంలో విద్యుత్ కోతలతో వరి పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పొలాలకు పారిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పొలాలకు నీరు పారించేందుకు కష్టపడిన రైతులు.. ప్రస్తుతం నీటిని తెచ్చుకోవడానికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...