వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం మండలం మరుపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థిపై దాడి ఘటనపై అధికారులు స్పందించారు.
ఈ మేరకు ఉపాధ్యాయుడు జి.రామకృష్ణను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ఆదేశించారు.
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

