Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థిని పరామర్శించిన మాజీ ఎంపీ

Follow Udayam on Google
Mohammad Aug 27, 2026 6:06 PM అనంతపురంGeneral
విద్యార్థిని పరామర్శించిన మాజీ ఎంపీ - Udayam
శెట్టూర్ ఎస్సీ హాస్టల్ ప్రహరీ గోడ కూలి గాయపడి విద్యార్థి అక్షయ్‌ను అనంతపురం జీజీహెచ్‌లో మాజీ ఎంపీ తలారి రంగయ్య గురువారం పరామర్శించారు. అక్షయ్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి, అన్నివేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హాస్టల్ భవనాల భద్రతపై అధికారులు శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...