Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకట్రావుపేట చెరువులో మట్టి తవ్వకాలు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:36 AM రంగారెడ్డి General
వెంకట్రావుపేట చెరువులో మట్టి తవ్వకాలు - Udayam
తలకొండపల్లి మండలం వెంకట్రావుపేట పెద్దకుంటలోని సర్వే నం.214లో అనుమతులకు మించి మట్టి తవ్వకాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. 7.20 ఎకరాల్లో 4,600 మెట్రిక్‌ టన్నుల మట్టికి అనుమతి ఉండగా, వందలాది టిప్పర్లతో తరలించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లోనూ తవ్వకాలు సాగాయని, చెరువు కట్టకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...