వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవి మండలం వెంకటాపురం–పెదకళ్లేపల్లి రహదారి అధ్వానంగా మారింది. కొత్త రహదారి నిర్మాణం కోసం పాత రోడ్డును తొలగించి చదును చేసి కంకర పరచిన అనంతరం పనులను మధ్యలోనే నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కంకర రాళ్లు పైకి రావడంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయి.
పదునైన కంకర రాళ్ల కారణంగా వాహనాల టైర్లు దెబ్బతిని తరచూ పంచర్లు అవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

