Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ లడ్డూ సత్రంలో ఈవో ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 5:28 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ లడ్డూ సత్రంలో ఈవో ఆకస్మిక తనిఖీ - Udayam
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని లడ్డూ సత్రాన్ని ఈవో ఎల్.రమాదేవి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లడ్డూ తయారీ, ప్యాకింగ్, పిండి రుబ్బే విభాగాలను పరిశీలించి పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. భక్తులకు నాణ్యమైన లడ్డూలు అందేలా నాణ్యతలో రాజీ లేకుండా పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...