Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములపల్లిలో పశువైద్యుడి కొరత

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:17 AM జయ శంకర్ భూపాలపల్లి General
వేములపల్లిలో పశువైద్యుడి కొరత - Udayam
మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో పశువైద్యుడు లేక పశుపోషకులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పనిచేసిన వైద్యుడు బదిలీ కావడంతో ఇన్‌ఛార్జ్‌ వైద్యుడితో సేవలు కొనసాగుతున్నాయి. ఇన్‌ఛార్జ్‌ వైద్యుడు సకాలంలో అందుబాటులో లేక పశువులకు చికిత్స అందడం లేదని రైతులు వాపోతున్నారు. మరో రెండు గ్రామాల రైతులు కూడా ఈ ఆస్పత్రిపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం రెగ్యులర్‌ పశువైద్యుడిని నియమించాలని కోరారు.

Comments

G
Loading comments...