వార్తలకు తిరిగి వెళ్లండి

కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు నుంచి చెల్లూరు వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరి రాళ్లు తేలడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు తెలిపారు.
రోడ్డును తాత్కాలికంగా కాకుండా వెంటనే పునర్నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

