వార్తలకు తిరిగి వెళ్లండి
యాదగిరిగుట్టలో నేటి నుంచి వరుణ యాగం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు 'వర్ష పాశుపత వరుణ యాగం' ప్రారంభమైంది. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ ప్రత్యేక యాగానికి హాజరయ్యే భక్తుల కోసం దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లోక కల్యాణం కోసం చేపట్టే ఈ యాగంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Comments
Loading comments...