Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వారణాసిలో గంగమ్మ ఉగ్రరూపం, ఘాట్‌లు జలమయం.

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 24, 2026 9:44 AM జాతీయంGeneral
వారణాసిలో గంగమ్మ ఉగ్రరూపం, ఘాట్‌లు జలమయం. - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం గంటకు 10 సెంటీమీటర్ల చొప్పున వేగంగా పెరుగుతుండటంతో ఘాట్‌లు, తీరంలో ఉన్న పలు దేవాలయాలు నీట మునిగాయి. వారణాసిలోని అస్సీ ఘాట్ నుండి నమో ఘాట్ వరకు ఉన్న దాదాపు 50కి పైగా ఆలయాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నదీ ప్రవాహం తీవ్రమవ్వడంతో బోట్ల విహారాన్ని నిలిపివేసి, గంగా ఆరతిని దాబా పై అంతస్తుల్లో నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...