వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
'వందేమాతరం' గేయాన్ని అవమానిస్తే.. మూడేళ్ల జైలు!

జాతీయ గేయం ‘వందేమాతరం’ని అవమానించడం లేదా దాని ఆలపనకు ఆటంకం కలిగించడం ఇకపై చట్టరీత్యా నేరంగా మారనుంది. 1971 నాటి ‘నేషనల్ హానర్’ చట్టానికి సవరణలు చేస్తూ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
ఈ సవరణతో వందేమాతరానికి జాతీయ గీతం ‘జన గణ మన’తో సమానమైన గౌరవం, రక్షణ లభించనున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...