Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనమహోత్సవంలో గంగారం అధికారులు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 2:50 PM మహబూబాబాద్ General
వనమహోత్సవంలో గంగారం అధికారులు - Udayam
గంగారం మండలంలో మంగళవారం నిర్వహించిన వనమహోత్సవంలో ఎంపీడీవో వైష్ణవి, తహశీల్దార్‌ బాలకిషన్‌ పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట పలు రకాల మొక్కలను నాటారు. ప్రకృతి సమతుల్యతకు దోహదపడే మొక్కలను పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీడీవో వైష్ణవి తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని తహశీల్దార్‌ బాలకిషన్‌ కోరారు.

Comments

G
Loading comments...