వార్తలకు తిరిగి వెళ్లండి

బాడంగి మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. బాడంగి మండలం హరిజన పాల్తేరుకు చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. శనివారం వీరంతా బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయన సమక్షంలో పార్టీలో చేరారు.
టీడీపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకార్షితులై టీడీపీకు ఆదరణ పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి పని చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

