Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ నాయకుడు పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

Follow Udayam on Google
Mohammad Oct 05, 2026 9:28 AM అనంతపురంGeneral
వైసీపీ నాయకుడు పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి - Udayam
పామిడి పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డులో వైసిపి నాయకులు మహేష్ రెడ్డి పై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న మహేష్ రెడ్డిని గుర్తించిన స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...