వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ రోడ్డులో వైద్య ఆరోగ్యశాఖ రెసిడెన్షియల్ క్వార్టర్స్ స్థలం చెత్తాచెదారంతో నిండిపోయింది. క్వార్టర్స్‌ను కూల్చివేసిన తర్వాత ఖాళీగా ఉన్న స్థలంలో చెత్త వేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి.
ప్రధాన రహదారి పక్కనే చెత్త పేరుకుపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

