వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో వరసిద్ధి వినాయక కమిటీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వినాయకుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు, యూనిఫామ్ ధరించి, చేతిలో వాటర్ బాటిల్‌తో అచ్చం విద్యార్థిలా కనిపించేలా గణనాథుడిని ఏర్పాటు చేశారు.
రాయదుర్గంలో వివిధ ఆకృతుల్లో గణనాథుల విగ్రహాలు కొలువుదీరాయి. ఈ ప్రత్యేక వినాయకుడి రూపాన్ని చూసేందుకు భక్తులు తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Comments
Loading comments...

