వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం గాంధీ మందిరంలోని స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో గురువారం పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య 120వ జయంతి వేడుకలను నిర్వహించారు.
వక్తలు మాట్లాడుతూ గాంధీజీ సిద్ధాంతాలను జీవితాంతం ఆచరించిన వావిలాల నిస్వార్థతకు, నిజాయితీకి ప్రతిరూపమని కొనియాడారు. మద్యపాన నిషేధం, తెలుగు భాషాభివృద్ధి ఉద్యమాలతో పాటు సమాజ సంస్కరణలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

