వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాసం చివరి పండుగైన పొలాల అమావాస్యను వాంకిడి మండల కేంద్రంలో రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఎడ్లను శుభ్రంగా కడిగి, కొమ్ములకు రంగులు వేసి జూలు, గంటలతో అందంగా అలంకరించారు.
సాయంత్రం ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకెళ్లి ఐదుసార్లు ప్రదక్షిణలు చేయించారు. అనంతరం గ్రామ పటేల్ తోరణం తెంపిన తర్వాత ఎడ్లను ఇళ్లకు తీసుకెళ్లారు.
Comments
Loading comments...

