Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాన తగ్గింది.. పొలాల్లో పనులు షురూ

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:56 AM ఆసిఫాబాద్General
వాన తగ్గింది.. పొలాల్లో పనులు షురూ - Udayam
ఆసిఫాబాద్ జిల్లాలో మూడు రోజులుగా కురిసిన మోస్తరు వర్షాలతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. మంగళవారం ఉదయం వర్షం తగ్గడంతో రైతులు తిరిగి పొలం బాట పట్టారు. పత్తి చేనుల్లో పెరిగిన కలుపు, గడ్డిని కూలీలతో తొలగిస్తున్నారు. రైతు కూలీలంతా వ్యవసాయ పనులకు వెళ్లడంతో కూలీల కొరత ఏర్పడిందని రైతులు తెలిపారు. దీంతో కలుపు తొలగింపు పనులు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...