Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్‌లో రోడ్డుపై వైద్య వ్యర్థాలు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:14 AM నారాయణపేటGeneral
ఊట్కూర్‌లో రోడ్డుపై వైద్య వ్యర్థాలు - Udayam
ఊట్కూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గేటు నుంచి వివేకానంద చౌరస్తా వరకు ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, పారాసెటమల్‌ పీడియాట్రిక్‌ సిరప్‌ బాటిళ్లు రోడ్డుపై కనిపించాయి. సిరప్‌ బాటిళ్లపై ఈ నెల 26తో గడువు ముగిసినట్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు. కొన్ని ఐరన్‌ మాత్రలకు గడువు ముగియలేదని పేర్కొన్నారు. విద్యార్థులు, పాడిపశువులు సంచరించే ప్రాంతంలో బయోమెడికల్‌ వ్యర్థాలు పడేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...