Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై అమెరికా దాడులు..

Follow Udayam on Google
Ravi Shukla May 28, 2026 2:39 PM జాతీయంGeneral
ఇరాన్‌పై అమెరికా దాడులు.. - Udayam
హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ డ్రోన్లను అమెరికా దళాలు అడ్డుకున్నాయి. తమ భద్రత కోసం ముందుచూపుతో ఆత్మరక్షణలో భాగంగానే ఇరాన్ సైనిక స్థావరంపై దాడులు చేశామని యూఎస్ అధికారులు వెల్లడించారు. బందర్ అబ్బాస్ సమీపంలో పేలుళ్లు సంభవించడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ చర్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ మండిపడింది. ఈ దాడుల వల్ల జరిగిన ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత లేదు. సున్నితమైన ప్రాంతంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఈ సైనిక ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

Comments

G
Loading comments...