Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుగ్వేతో భారత్‌ ఫుట్‌బాల్‌ సమరం

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 9:48 AM జాతీయంక్రీడలు
ఉరుగ్వేతో భారత్‌ ఫుట్‌బాల్‌ సమరం - Udayam
బ్రెజిల్‌తో ఓటమి తర్వాత భారత్‌ మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. మంగళవారం సాల్ట్‌లేక్‌ స్టేడియంలో జరిగే స్నేహపూర్వక మ్యాచ్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఉరుగ్వేతో భారత్‌ తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 138వ స్థానంలో ఉన్న భారత్‌కు ఉరుగ్వేపై గోల్‌ చేయడం సవాలే. ఇటీవల 44వ ర్యాంకు పనామాతో 1-1 డ్రా చేసుకోవడం భారత్‌కు సానుకూలాంశం. ఆ మ్యాచ్‌లో గోల్‌ చేసిన ర్యాన్‌ విలియమ్స్‌పై ఆశలు ఉన్నాయి.

Comments

G
Loading comments...