Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వై.రామవరంలో 176 టన్నుల యూరియా సిద్ధం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 07, 2026 4:27 PM అల్లూరి General
వై.రామవరంలో 176 టన్నుల యూరియా సిద్ధం - Udayam
వై.రామవరం మండలంలో 176 టన్నుల యూరియా సిద్ధంగా ఉందని వ్యవసాయ అధికారి సుజాత తెలిపారు. చవిటి దిబ్బలు, పానశాలపాలెం, ఎర్రగొండ రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల పంపిణీ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ-క్రాప్ నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా, డీఏపీ ఎరువులు అందిస్తామని తెలిపారు. రైతులు తమ భూమి, పంట వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని, యూరియా కోసం ఆధార్, ఫోన్ నంబర్‌తో రావాలని సూచించారు.

Comments

G
Loading comments...