వార్తలకు తిరిగి వెళ్లండి

విష జ్వరంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తీర్థాలకు చెందిన షేక్ ఆస్మాన్ కు ఒక రోజు జ్వరం వచ్చి అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 6 రోజుల పాటు చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచాడు. యువకుడి మృతితో వారి కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

