Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రొవిజనల్ కీ విడుదల

Follow Udayam on Google
Vikram Singh May 28, 2026 10:58 AM జాతీయంGeneral
యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రొవిజనల్ కీ విడుదల - Udayam
యూపీఎస్సీ మొదటిసారిగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2026 ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను మే 31వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ధృవీకరణ పత్రాలతో సమర్పించవచ్చు. నిపుణుల బృందం పరిశీలన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీఎస్సీ పేర్కొంది. ఈ నెల 24న జరిగిన ఈ పరీక్షకు దాదాపు 5.49 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, తుది ఆన్సర్ కీని ఫలితాల తర్వాత విడుదల చేయనున్నట్లు కమిషన్ తెలిపింది.

Comments

G
Loading comments...