వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగుస్తుందని సంగారెడ్డి జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ నెల 16న ప్రవేశ పరీక్ష నిర్వహించి 100 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లో ఐదు నెలల ఉచిత శిక్షణ అందిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

