వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది. రెండు నెలలుగా వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు తాజా వర్షాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే చేతికొచ్చిన పత్తి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటల సంరక్షణకు వర్షం ఉపయోగపడుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

