Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై నిరుద్యోగులు.

Follow Udayam on Google
రచన దేవి Jul 04, 2026 4:28 PM జాతీయంGeneral
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై నిరుద్యోగులు. - Udayam
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము 20 వేల పోలీస్ ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేస్తుంటే, కేవలం 5 వేల ఉద్యోగాలే అడుగుతున్నారంటూ సీఎం తప్పుదోవ పట్టిస్తున్నారని నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపించారు. హక్కుల కోసం ప్రశ్నిస్తే పురుగుల మందు తాగి చావాలని మాట్లాడటం తగదని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...