వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట శాఖా గ్రంథాలయంలో నిరంతరం శ్రమించి చదువుకుని, రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు ఎంపికైన వేలగా హేమంత్, భక్తసాయి శంకర్లను స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో ఉద్యోగాలు సాధించిన యువకులకు సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

