Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు... శివారు కాలనీలకు వరద భయం

Follow Udayam on Google
p.g.murthy Jul 30, 2026 8:50 AM మంచిర్యాలGeneral
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు... శివారు కాలనీలకు వరద భయం - Udayam
జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివారులలో ఉన్న వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గురువారం ఉదయం ఐదు గంటల నుండి జన్నారంలో ఏకధాటిగా అతి భారీ వర్షం పడుతోంది. దీంతో కొత్తపేట, జన్నారం, మహమ్మదాబాద్, రోటిగూడ, మొర్రిగూడ వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు జన్నారం వాగు సమీపంలోని బుడగ జంగాల కాలనీ, సుందరయ్య నగర్, జువ్విగూడా, గాంధీ నగర్ కాలనీలలో వరద వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు భయపడుతున్నారు. వరద వచ్చే పక్షంలో తులసిత ప్రాంతాలకు తరలించేలా అది కాదు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...