వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం ఉదయం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి హాజరయ్యారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నిజాం మాట్లాడుతూ.. పర్యావరణం పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు.
ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని వారు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

